MBNR: మహబూబ్నగర్ జిల్లాలో న్యాయ సేవలను విస్తరించేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ వాహనాలు ప్రతి నెలా జిల్లాలకు పంపి, లిటరసీ క్యాంపులు, జైళ్ల సందర్శనలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయన్నారు.