TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ MLA పైలట్ రోహిత్‌రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డి, వ్యాపారి నమిత్ శర్మకు ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.