KMM: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో నిన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద ‘హ్యాపీ సండే’ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు. ఆటపాటలు, వివిధ పోటీలతో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా గడిపినట్లు నిర్వాహకులు తెలిపారు.