ప.గో: కోపల్లె బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. రూ.4 కోట్ల వ్యయంతో కాళ్ల మండలం కోపల్లె వద్ద కొత్తగా నిర్మించనున్న నాలుగులైన్ల వంతెన పనులను ఆదివారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ లేకుండా పనులు చేయాలని గుత్తేదారులకు సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయం అధికారులు పర్యవేక్షించాలన్నారు