MLG: పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన రఫియా (28) వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసినవారు PS నెంబర్ 8712670091కు సమాచారం ఇవ్వాలని CI కోరారు. ఆచూకీ తెలిపిన వారికి పారితోషకం అందజేస్తామన్నారు.