MHBD: మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారానే పక్క సమాచారం మేరకు SI వీరభద్రం ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు యువకులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.