కోనసీమ: అమలాపురం కలెక్టరేట్లో ఇవాళ ‘PGRS’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని సూచించారు.