TG: ప్రస్తుతం మార్చి నెలకు సంబంధించి రేషన్ పంపిణీ గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా చాలామంది లబ్ధిదారులు బియ్యం తీసుకోలేదని గుర్తించిన ప్రభుత్వం.. మరో రెండు రోజుల పాటు గడువును పొడిగించింది. రేషన్ కార్డుదారులు మార్చి 17వ తేదీ వరకు సమీపంలోని రేషన్ డీలర్ల వద్ద బియ్యం తీసుకోవచ్చు. ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది.