Rahuliకి పెళ్లి చేద్దామా..? సోనియా చెవిలో హర్యానా మహిళా గుసగుసలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల సోనియా గాంధీ ఇంటికి వచ్చిన హర్యానా మహిళ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
Rahul Marriage: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెళ్లి గురించి ఎప్పుడూ ప్రస్తావన వస్తోంది. పెళ్లి వయస్సు పెరిగిపోవడంతో అంతటా అదే ప్రశ్న ఎదురవుతోంది. ఇటీవల సోనియా గాంధీతో ఓ హర్యానా మహిళా కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. పక్కనే ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ముసి ముసి నవ్వుతూ.. అవుతుంది.. అంటూ అనేశారు. ఆ వీడియో యూ ట్యూబ్లో ట్రోల్ అవుతుంది.
సోనియా ఇంటికి హర్యానా మహిళలు
ఇటీవల రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రయాణించే సమయంలో హర్యానా మహిళలు కనిపించారు. దాదాపు 20 మందిని చూసి తన కాన్వాయ్ ఆపి.. వారితో మాట్లాడారు. అక్కడే ఉండి ప్రియాంక గాంధీకి ఫోన్ చేశారు. ఇంటికి ఆహ్వానించానని.. రావాలని కోరగా ఆమె కూడా ఓకే అన్నారు. ఆ మహిళలను ఢిల్లీకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. హర్యానా నుంచి ఢిల్లీ వచ్చి అక్కడ చారిత్రాక ప్రదేశాలను సందర్శించారు. చివరికీ సోనియా గాంధీ ఇంటికి చేరుకున్నారు.
రాహుల్ పెళ్లి
హర్యానా మహిళలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ ఆహ్వానించారు. వారితో సరదాగా గడిపారు. మంచి చెడు కనుక్కున్నారు. హర్యానా నుంచి తీసుకొచ్చిన నెయ్యి, మజ్జిగను సోనియాకు అందజేశారు. తర్వాత అంతా కలిసి లంచ్ చేశారు. రాహుల్ గాంధీ పిల్లలకు చాక్లెట్స్ కూడా అందజేశారు. ఆ సమయంలోనే సోనియాగాంధీతో ఓ మహిళ రాహుల్ గాంధీ పెళ్లి గురించి ప్రస్తావించారు. రాహుల్కు పెళ్లి చేద్దామా అని అడిగారు. అందుకు సోనియా స్పందిస్తూ.. మీరే మంచి అమ్మాయిని చూడాలని అడిగారట. అందుకు ఆ మహిళ కూడా ఓకే అన్నట్టు తల ఊపారు. రాహుల్ గాంధీ నవ్వుతూ అవుతుంది.. అవుతుంది అన్నారట.
ఆట, పాట
భోజనం చేసిన తర్వాత.. ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడి, పాడారు. సోనియా, ప్రియాంక, రాహుల్ (Rahul).. హర్యానా మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు. ఓ మహిళ రాజీవ్ మరణం గురించి సోనియాను అడగగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అమ్మ కుంగిపోయిందని.. అన్నం, నీళ్లు కూడా ముట్టలేదని ప్రియాంక చెప్పారట. అప్పుడు సోనియా కంటి నుంచి నీళ్లు వచ్చాయి.