టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సినీ దర్శకుడు ఆర్జీవీ, ఏపీ సీఎం జగన్ లపై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆర్జీవీ చేసిన కామెంట్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఆయన… జగన్ పై కూడా మండిపడ్డాడు. చంద్రబాబు, పవన్ భేటీతో… జగన్ కి బీపీ పెరిగింది అని ఆయన ఎద్దేవా చేశారు.
‘‘ముందు ముందు.. బాహుబలులు చాలా మంది చంద్రబాబుని కలుస్తారు. అప్పుడు ఇంకా హార్ట్ ఎటాక్ లు వస్తాయి. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు-పవన్ కలయికను కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వైసీపీ పాలనకు స్వస్తి చెప్పడానికి అన్ని పార్టీలు కలవాల్సిందే. రాష్ట్ర మంత్రులు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. భస్మాసురుని అంతం కోసం టీడీపీ ఎవరితోనైనా కలుస్తుంది. చంద్రబాబు-పవన్ ఇక చాలా సార్లు కలుస్తారు. అయినా మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? వైసీపీది జైలు పార్టీ. ఖేల్ ఖతం… దుకాణం బంద్. ప్రత్యేక హోదా కోసం జగన్ ఢిల్లీలో పోరాడే దమ్ము ఉందా?. బాబాయ్‌ను చంపిందెవరో జగన్ చెప్పాలి.’’ అంటూ బండారు నిలదీశారు.
ఇక ఆర్జీవీని అయితే… తీవ్రంగా విమర్శించారు. రామ్‌గోపాల్‌వర్మ.. ఒక కామ మృగం, దరిద్రుడని మండిపడ్డారు. కులాల గురించి వర్మ మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమ్మ, కాపులు కలిస్తే.. ఆర్జీవీకి వచ్చిన ఇబ్బంది ఏంటని బండారు ప్రశ్నించారు. ఆర్జీవీని ఆయన భార్య, కూతురు కూడా అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు.