TPT: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల సందర్భంగా 165 కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉండగా, మాస్ కాపీయింగ్ వంటి అవకతవకలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.