AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. పార్టీ నేత వేముల పాటి అజయ్ కుమార్ కార్యక్రమం నిర్వహించడంపై శ్రీధర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చొరవ చేసుకుని చెదరగొట్టారు.