దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా రఘునందన్ రావు (Raghunandan Rao) గెలిచిన తర్వాత ఆయన చరిష్మా మరింత పెరిగింది. బీజేపీకి మంచి ఊపు వచ్చింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావు దుబ్బాక నుంచి కాకుండా మరో సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే బండి సంజయ్ (Bandi Sanjay) టీ బీజేపీ చీఫ్ ఉన్నప్పుడు ఆయనకు, రఘునందన్ రావుకు పెద్దగా పొసిగేది కాదు. దీంతో అంటీముట్టనట్టు ఉండేవారు. బండిని తప్పించిన తర్వాత తనకు ప్రాధాన్యత దక్కుతుందని రఘునందన్ రావు ఆశించారు. ఢిల్లీ (Delhi) వెళ్లి తన డిమాండ్లను హైకమాండ్ ముందు ఉంచారు. అయినా అవి నెరవేరలేదు. దీంతో ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనట్లేదు. కిషన్ రెడ్డి (Kishan Reddy) వచ్చిన తర్వాత కూడా తన రాత మారలేదని రఘునందన్ రావు ఆలోచిస్తున్నారు.మరోవైపు దుబ్బాకలో ఓ వర్గం ఎప్పటి నుంచో రఘునందన్ రావును వ్యతిరేకిస్తోంది.
మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు రఘునందన్ రావును అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి రఘునందన్ రావుకు దుబ్బాక టికెట్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. ఇస్తే తాము సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. దీన్ని పసిగట్టిన రఘునందన్ రావు.. ఈసారి దుబ్బాకలో కాకుండా పటాన్ చెరు(Patan Cheru)లో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. పటాన్ చెరులోనే రఘునందన్ రాజకీయం మొదలైంది. తనకు మంచి అనుచరగణం కూడా ఉంది. పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. ఈ అంశాలన్నీ తన గెలుపుకు దోహదపడతాయని రఘునందన్ రావు అంచనా వేస్తున్నారు. మరి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి. కేటీఆర్ , హరీష్ రావులపై విమర్శలు గుప్పించే రఘునందన్ రావు (Raghunandan rao) కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇటీవల చేసిన ఆరోపణలు కూడా బీజేపీకి దూరమయ్యేలా అలాగే అధికార పార్టీకి దగ్గరయ్యే వ్యూహంతోనే చేశారన్న టాక్ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. అయితే రఘునందన్ రావు (Raghunandan rao) రాకను అధికార పార్టీకి చెందిన కీలక మంత్రి అడ్డుకుంటున్నారని..ఆయనే బీఆర్ఎస్ లో చేరే విషయంలో అడ్డంకిగా మారారని టాక్. కానీ కేసీఆర్ రంగంలోకి దిగితే ఎప్పుడు ఎలాంటి పరిణామాలైన చోటు చేసుకోవచ్చు.
చదవండి :BRO Movie: పవన్ పై సాయి ధరమ్ తేజ ఎమోషనల్ నోట్