E.G: ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో సోదరభావం వెల్లివిరుస్తుందని మండపేట పుర పాలక సంఘం ఛైర్పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. మండపేట వైసీపీ మైనార్టీ విభాగం అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఛైర్పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందూ ముస్లింలు ఇక్కడ అన్యోన్యంగా ఉంటారని పేర్కొన్నారు.