PPM: జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమన్వయ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం సమీక్షించారు.