W.G: వెంకట రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన కళాశాలలో ఆదివారం క్రీడా సంబరాలు ముగిశాయి. అనంతరాజుపేట విద్యార్థులు అత్యధిక విజయాలతో సత్తా చాటారు. కబడ్డీ, త్రోబాల్, మహిళల బాస్కెట్బాల్, వాలీబాల్ విభాగాల్లో వీరు విజేతలుగా నిలిచారు. పురుషుల బాస్కెట్ బాలో వెంకటరామన్నగూడెం, వాలీబాల్లో పులివెందుల, రిలే పరుగులో అనంతపురం జట్లు గెలుపొందాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.