NZB: నందిపేట్‌లోని మస్జిద్ మౌజా వద్ద రంజాన్ ఈద్ పురస్కరించుకొని నందిపేట్ ఎన్టీఆర్ కాలనీ, బజార్ కొత్తూర్ గ్రామాల పేద ముస్లిం కుటుంబాలకు తోఫాల పంపిణీని చేపట్టారు. బజార్ కొత్తూర్ సర్పంచ్ గోపుముత్యం, నందిపేట్ వార్డు సభ్యుడు పాషా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ జమీల్ పాల్గొని లబ్ధిదారులకు తోఫాలను అందజేశారు.