విశాఖ కాన్వెంట్ జంక్షన్ సమీప భూపేష్ నగర్లో ఆదివారం ఐద్వా ఆధ్వర్యంలో కాలనీవాసులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. యువత మద్యం, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.