ATP: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకస్మిక వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో పొలాల్లో ఉండేవారు, ప్రయాణికులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.