MNCL: సింగరేణి కార్మికులను మభ్యపెట్టడానికే AITUC బస్సు యాత్ర చేపట్టిందని INTUC బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ శనివారం విమర్శించారు. CM అసెంబ్లీలో కార్మికులకు వరాలు ప్రకటించబోతున్నారని తెలిసి, ఆ క్రెడిట్ కొట్టేందుకే ఏఐటీయూసీ అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కార్మికులు వాస్తవాలు గమనించాలని, గుర్తింపు సంఘం తీరును నిలదీయాలని కోరారు.