CTR: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు తెలిపారు. జిల్లాలోని 114 పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలు తీసుకున్నామని, మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.