సత్యసాయి: మడకశిర మండలం వైబీ హళ్లిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుంచిటిగ వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఛైర్మన్ నరసింహరాజు, కన్వీనర్లు, క్లస్టర్ ఇంఛార్జ్ నాయకులు పాల్గొన్నారు.