Congress, BRS File No Confidence Motion Against Government In Lok Sabha
No Confidence Motion: మణిపూర్‌లో జరుగుతోన్న హింసపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. ప్రధాని మోడీ (pm modi) సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెట్టాలని విపక్ష కూటమి నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ (congress), బీఆర్ఎస్ (brs) సభ్యులు ఈ రోజు స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. వాస్తవానికి లోక్ సభలో మోడీ (modi) ప్రభుత్వానికి మెజార్టీ ఉంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ.. మణిపూర్ అంశంపై సమాధానం ఇస్తారని విపక్షాలు భావిస్తున్నాయి.
లోక్ సభలో (loksabha) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు (speaker) నోటీసులు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ ఉప నేత గౌరవ్ గొగొయ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (nama nageshwar rao) కూడా తీర్మానంపై నోటీసు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన తర్వాత మోడీ (modi) మాట్లాడితే .. ఇతర అంశాలను కూడా లేవనెత్తే అవకాశం ఉంటుందని భావిస్తోంది. దీనికి సంబంధించి తీర్మాన ముసాయిదా కూడా సిద్దం చేశారని తెలుస్తోంది. విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అన్నీ పార్టీలతో చర్చిస్తాను.. తర్వాత చర్చకు సమయం కేటాయిస్తాను అని స్పీకర్ తెలిపారు.
లోక్ సభలో బీజేపీకి (bjp) 300 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఎన్టీయే కూటమికి 330 మంది సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమికి కేవలం 140 మంది ఎంపీలు ఉన్నారు. మరో 60 మందికి పైగా ఏ కూటమిలో లేరు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయం.. కానీ మణిపూర్ అంశంపై చర్చ కోసం తీర్మానం ప్రవేశ పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. 2018లో మోడీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి కూడా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. అప్పుడు తీర్మానం వీడిపోయింది. ఎన్టీయేకు 325 మంది విపక్షాలకు 126 మంది సభ్యులు మద్దతు ఇవ్వడంతో వీగిపోయింది.