CTR: మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం పుత్తూరు, నగరి, విజయపురం మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం నేసనూరులో శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో రుద్రాభిషేకంలో పాల్గొని, అనంతరం పలు గ్రామాల్లో కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం నగరిలో కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొనగా, సాయంత్రం విజయపురం మండలంలో YCP నాయకుల కుటుంబాలను పరామర్శిస్తారు.