కృష్ణా: ఉయ్యూరు 18వ వార్డులో అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన 50 మంది పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చీరలు, రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదర, సోదరీమణులు రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షను చేపట్టి ఎంతో పవిత్రంగా ఉంటారిని, నెలంతా సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు సహాయం చేస్తుంటారని తెలిపారు.