CTR: నిండ్ర మండలంలోని నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షించారు. రైతులకు రూ.35.92 కోట్లు, ఉద్యోగులకు రూ.13 కోట్లు బకాయిలుగా ఉన్నట్లు తెలిపారు. బకాయిల వసూళ్ల కోసం అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.