KMR: 2026-27 జనగణన దశ-1 గృహ జాబితా, గృహ గణన కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులకు కలెక్టరేట్లో ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో జనగణనను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ఈ శిక్షణా మార్చి 15 నుంచి 17 వరకు IDOC సమావేశ మందిరంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తహశీల్దార్లు పాల్గొన్నారు.