BDK: భద్రాచలం పట్టణంలో దళిత బహుజన ఆశాజ్యోతి మాన్యవర్ కాన్షిరామ్ జయంతి వేడుకలను ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. కాన్షిరామ్ భారత రాజకీయాల్లో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికారని కొనియాడారు.