ASR: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఈ సీజన్‌కు సంబంధించిన చింతపండు, పసుపు మద్దతు ధరలను పెంచింది. మన్యం ప్రాంతంలో ప్రస్తుతం ఈ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత ఏడాది చింతపండు కిలో రూ.36, పసుపు కిలో రూ.115గా ఉండగా, ఈసారి జీసీసీ చింతపండు ధరను కిలోకు రూ.45కు, పసుపు ధరను రూ.130కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.