విశాఖలో ఆదివారం ప్రజా ప్రస్థానం పార్టీ 5వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట ముకుంద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. గ్యాస్ రేట్లు పెంచినా దొరకడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని, ప్రజలకు అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయాలన్నారు.