ATP: గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదివారం పార్కింగ్ చేసి ఉంచిన బైకును గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన కళ్యాణ్ కన్నా తన బైకును రైల్వే స్టేషన్ ఆవరణలో పార్కింగ్ చేసి, స్టేషన్లోకి వెళ్లాడు. వచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు. వెంటనే డయల్ 100కు సమాచారమిచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.