Sherlyn Chopra: కిడ్నీ ఫెయిలై చనిపోయే స్థితికి నటి..3 నెలలు నరకం!
ప్రముఖ బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను కిడ్నీ వ్యాధితో బాధపడ్డానని, చనిపోయే పరిస్థితి వచ్చినట్లు తెలిపింది. తాజాగా ఆమె పౌరశ్పూర్2 వెబ్‌సిరీస్ చేస్తోంది. ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తరచూ వివాదాస్పద వార్తల్లో నిలుస్తుండే బాలీవుడ్(Bollywood) హీరోయిన్ షెర్లిన్ చోప్రా(Sherlyn chopra) మరోసారి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. చాలా కాలం తర్వాత ఈ బ్యూటీ పౌరశ్పూర్ 2 (Paurashpur Season2) వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె మహారాణి స్నేహలతగా నటించనుంది. జూలై 28వ తేదీన ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆల్ట్ ఆలాజీలో పౌరశ్పూర్ 2 వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా షెర్లిన్ చోప్రా(Sherlyn chopra) తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 2021లో తన కిడ్నీ ఫెయిలైందని (Kidney Failure), తాను బతకడం కష్టమని, చచ్చిపోతానేమోనని అనుకున్నట్లు తెలిపింది. అయితే తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందని, తానెంతో సాధించాలని గ్రహించినట్లు చెప్పింది. తనకు ఆ సమయంలో డాక్టర్ రెండు ఆప్షన్లు ఇచ్చాడని, డయాలసిస్ చేయించుకుంటావా? లేక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటావా? అని అడిగినట్లు తెలిపింది.
తనకు కిడ్నీ దానం చేసేందుకు తన కుటుంబ సభ్యలెవ్వరూ రాలేదని, ఆ సమయంలో ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది. డయాలసిస్ అంటే వారంలో మూడు రోజులు ఆస్పత్రికి వెళ్తూ ఉండాలని, అలాంటి జీవితాన్ని తాను కోరుకోలేదని తెలిపింది. అయితే మూడు నెలల పాటు మందులు వాడిన తర్వాత ఆ వ్యాధి దానంతట అదే నయమైనట్లు వెల్లడించింది. తనకు పునర్జన్మ లభించిందని, ఇప్పుడు తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని షెర్లిన్ చోప్రా (Sherlyn chopra) చెప్పుకొచ్చింది.