ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో రోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కృషితో గ్రామంలో మూడు రోడ్లకు మహా దశ పట్టింది. జగనన్న కాలనీతో పాటు మరో రెండు రోడ్లు పనులు ఇవాళ చురుగ్గా జరుగుతున్నాయి. పనులను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.