BPT: పర్చూరు మండలంలోని కారంచేడు గ్రామంలో దగ్గుపాటి వారి దేవర శ్రీ పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పుణ్యకార్యము బ్రహ్మశ్రీ కారంచేటి వెంకట పిచ్చయ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.