»Adivi Sesh Teases Massive Preparations For Highly Anticipate
Adivi Sesh: గూఢచారి నుంచి శేష్ అదిరిపోయే అప్ డేట్..!
యంగ్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతోంది. మూవీ మూవీకి వేరియేషన్స్ ఇస్తూ, సూపర్ హిట్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆయన కెరీర్ లో గూడఛారి మూవీ ఎంత పెద్ద హిట్టో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కాగా తాజాగా దీనికి సీక్వెన్స్ మూవీ గురించి ఆయన క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
2018లో విడుదలైన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జీ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం శేష్ ట్విట్టర్ వేదికగా ఈ చిత్రం అప్డేట్ ఇచ్చారు. కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘మీ ప్రేమకు ధన్యవాదాలు. గేమ్ ఛేంజింగ్ సినిమాను అందించేందుకు దర్శకుడు వినయ్ కుమార్, రచయిత అబ్బూరి రవి ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. ‘జీ2’ స్క్రిప్ట్ భారీ స్థాయిలో ఉండనుంది. వినయ్ కుమార్ విజన్ చూస్తుంటే అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. కానీ, నేను చెప్పబోయేది ఒక్కటే.. సినిమా అదిరిపోద్ది’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి ఓ నెటిజన్ ‘గూఢచారి’ గ్లింప్స్ పోస్ట్ చేసి ‘టాలీవుడ్లో వచ్చిన ది బెస్ట్ స్పై థ్రిల్లర్స్‌లో ఇదొకటి’ అని పేర్కొన్నారు. దీనికి శేష్ సీక్వెల్‌పై ట్వీట్ పెట్టారు. కాగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అడివిశేష్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.