నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సుఖాసనంలో కూర్చోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉండి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తింటున్నప్పుడు ముందుకు వంగడం వల్ల మెదడుకు త్వరగా సంకేతాలు వెళ్లి, అతిగా తినకుండా ఆపుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ అలవాటు కీళ్ల నొప్పులను తగ్గించి, శరీరాన్ని ఫ్లెక్సిబుల్ ఉంచుతుంది.