అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, అక్కడ జరగాల్సిన 12వ తరగతి CBSE బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో రేపటి నుంచి ఏప్రిల్ 10, 2026 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రద్దు చేసినట్లు సీబీఎస్ఈ ప్రకటన విడుదల చేసింది.