NGKL: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కాన్షీరామ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల రాజకీయ చైతన్యానికి పునాది వేసిన మహానేత కాన్షీరామ్ అని, అంబేడ్కర్ ఆశయాలకు ఆయన ఊపిరి పోశారని సంఘం అధ్యక్షుడు గణేశ్ కొనియాడారు.