TG: రాష్ట్రవ్యాప్తంగా మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశ జనగణన జరగనుంది. ఈ క్రమంలో గృహాల జాబితా, వివరాల సేకరణకు అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయి. వాటికి కచ్చితంగా సమాధానం చెప్పాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోలికేరి సూచించారు. ఎవరైనా వివరాలు చెప్పకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, వారిపై రూ.1,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.