SDPT: ధూళిమిట్ట గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు శనివారం పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన సుద్దాల బాబు (32) అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎండి అసిఫ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.