విజయనగరం శారధి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న అంధ బాలికల హాస్టల్లో వీవైశ్య 8వ వార్షికోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా హాస్టల్లోని బాలికలకు అత్యవసరమైన శానిటరీ ప్యాడ్స్‌ను ప్రతి 45 రోజులకు ఒకసారి అందించే బాధ్యతను వీవైశ్య వాసుదేవ స్వీకరించినట్లు అధ్యక్షుడు అరిసెట్టి ముకేష్ తెలిపారు. అదేవిదంగా 2 సీలింగ్ ఫ్యాన్లు, 5 ట్యూబ్ లైట్లు పంపిణీ చేశారు.