ఓటీటీ అందుబాటులోకి వచ్చాక సరికొత్త కంటెంట్‌కు కొదవ లేకుండా పోయింది. అలాగే నటీ నటులకు అవకాశాలు ఎక్కువయ్యాయి. ఫేడవుట్ హీరోలు, హీరోయిన్లు, వెటరన్ యాక్టర్స్ సిరీస్‌ల బాట పడుతున్నారు. తాజాగా జేడీ చక్రవర్తి 'దయా' అనే సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
థియేటర్లో సినిమాలు, ఓటిటిలో వెబ్ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా డిజిటల్ బాట పడుతున్నారు. వెంకటేష్, రానా లాంటి వారు కూడా ఓటిటిలో వెబ్ సిరీస్ చేశారంటే.. వెబ్ సిరీస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు జేడీ చక్రవర్తి కూడా ఓటిటి బాట పట్టాడు. ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసిన జేడీ చక్రవరి.. టాలీవుడ్, బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత కొన్నాళ్లేగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు ఈ సీనియర్ హీరో. కానీ ఇప్పుడు ‘దయా’ అనే ఒక వెబ్ సిరీస్‌తో ఓటిటి ఎంట్రీ ఇస్తున్నాడు.
తెలుగమ్మాయిలు ఇషా రెబ్బ, బుల్లి తెర యాంకర్ విష్ణుప్రియ, రమ్యనంబీసన్, జోష్ రవి, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించిన ఈ క్రైమ్ సిరీస్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. పవన్ సాదినేని దర్శకుడిగా.. ఎస్వీఎఫ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ సిరీస్.. ఆగస్టు 4 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో.. ఆదివారం ఈ సిరీస్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి(JD Chakravarthi) మాట్లాడుతూ ‘గులాబీ’ సినిమాతో తనను హీరోను చేసిన కృష్ణవంశీ.. ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం ఆనందంగా ఉందని అన్నాడు. అలాగే తను చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. పక్క క్రైమ్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కిందని చెప్పొచ్చు.