తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఐ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడం చాలా ఆనందదాయకమని తెలిపారు.