KRNL: ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఇన్విజిలేటర్లు, విధుల్లో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించరన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.