VSP: ఏయూ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో శతాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం ‘ఫార్మా అన్వేషణ్–2026’ కార్యక్రమం నిర్వహించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జషుబాయ్ హెచ్. చౌదరి హాజరయ్యారు. ఫార్మసీ విద్యార్థుల ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ పాల్గొన్నారు.