KMM: నగరంలో ఆస్తి పన్ను పెంచడంతో పాటు ప్రైవేట్ సంస్థకు అప్పగించి అడ్డగోలుగా వసూలు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో ఈఈకి వినతిపత్రం అందజేశారు. ఇంటితో పాటు పార్కింగ్, అండర్ గ్రౌండ్ స్థలాలకు సైతం ఆస్తి పన్ను వసూలు చేయడం గర్హనీయమన్నారు.