CTR: పూతలపట్టు(మం) RVS నగర్ వద్ద శనివారం రెండు బైకులు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. వేల్కూరు చెందిన హేమంత్, అతని ఫ్రెండ్ చిత్తూరు నుంచి బైకుపై వస్తుండగా దారి మధ్యలో మరో బైకు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.