NLG: చిట్యాల మండలం వట్టిమర్తి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విజ్ఞాన యాత్రకు సామాజిక సేవకుడు నర్రా వేణు మోహన్ రెడ్డి రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ జానకి మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఇలాంటి యాత్రలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ శ్రీలత శ్రీను విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.