JGL: పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఒక వరమని ఏఎంసీ ఛైర్మన్ రాములు గౌడ్ అన్నారు. శనివారం పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో లావణ్య-తిరుపతి దంపతుల ఇందిమ్మ ఇల్లును సర్పంచ్ వనజతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు పాల్గొన్నారు.