BPT: బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద జనసేన పార్టీ నాయకుల సహకారంతో, అక్షయ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.